కళల వెలుగు
తేదీ
: 30-05-2026
తెలుగు కళా రంగాలను సాంస్కృతిక సేవా సంస్థ, మే 30
నేషనల్ క్రియేటివ్ డే సందర్భంగా
లలిత కళల ప్రాధాన్యతను తెలియజేస్తూ
ఆరోగ్యకరమైన జీవనం – ఆనందభరితమైన జీవితానికి
సృజనాత్మక కళల అవసరాన్ని వివరిస్తూ
నా చిన్న కవితా సమర్పణం.
రచన:
డా.
పలుకుర్తి మేరీ అనుపమ
విశాఖపట్నం,
ఆంధ్రప్రదేశ్.
శీర్షిక
: కళల వెలుగు
లలిత
కళలు జీవానికి వెలుగుల వాకిలి,
మనసుకు నిత్యం ఆనందాల జాబిలి.
రాగాల
స్వరాలు హృదయాన్ని హాయిచేస్తే,
రంగుల చిత్రాలు కలలకు రూపమిస్తే.
నృత్యపు
అడుగులు ఆరోగ్యానికి ఆధారం,
కవితల పరిమళం జీవితానికి సౌందర్యం.
వీణానాదం
వేధనలను దూరం చేస్తే,
చిత్రలేఖనం చింతలను చెరిపివేస్తే.
కళల
సృజన మనసుకు ప్రశాంతి నింపి,
మంచి భావాలను మానవత్వంగా మార్చి,
ప్రేమను,
కరుణను ప్రపంచానికి పంచి,
సంతోషపు మార్గాలను అందంగా తీర్చిదిద్దుతుంది.
రంగులు,
రాగాలు, భావాల వెలుగులతో,
లలిత కళలు జీవనాన్ని ఆరోగ్యమయం
చేస్తాయి,
ఆనందభరితమైన భవిష్యత్తుకు దారితీస్తాయి.
Comments
Post a Comment