కళల వెలుగు
తేదీ : 30-05-2026 తెలుగు కళా రంగాలను సాంస్కృతిక సేవా సంస్థ , మే 30 నేషనల్ క్రియేటివ్ డే సందర్భంగా లలిత కళల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆరోగ్యకరమైన జీవనం – ఆనందభరితమైన జీవితానికి సృజనాత్మక కళల అవసరాన్ని వివరిస్తూ నా చిన్న కవితా సమర్పణం . రచన : డా . పలుకుర్తి మేరీ అనుపమ విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్ . శీర్షిక : కళల వెలుగు లలిత కళలు జీవానికి వెలుగుల వాకిలి , మనసుకు నిత్యం ఆనందాల జాబిలి . రాగాల స్వరాలు హృదయాన్ని హాయిచేస్తే , రంగుల చిత్రాలు కలలకు రూపమిస్తే . నృత్యపు అడుగులు ఆరోగ్యానికి ఆధారం , కవితల పరిమళం జీవితానికి సౌందర్యం . వీణానాదం వేధనలను దూరం చేస్తే , చిత్రలేఖనం చింతలను చెరిపివేస్తే . కళల సృజన మనసుకు ప్రశాంతి నింపి , మంచి భావాలను మానవత్వంగా మార్చి , ప్రేమను , కరుణను ప్రపంచానికి పంచి , సంతోషపు మార్గాలను అందంగా తీర్చిదిద్దుతుంది . రంగులు , రాగాలు , భావాల వెలుగులతో , లలిత కళలు జీవనాన్ని ఆరోగ్యమయం చేస్తాయి...